రియల్‌ లైఫ్‌లో నిఖిల్‌ రౌడీ వేశాలు…!

Actor Nikhil Siddharth Roughs Up Four Students

హీరో నిఖిల్‌ ఈమద్య కాలంలో సినిమాల సంఖ్య కాస్త తగ్గించాడు. మంచి చిత్రాలతోనే రావాలనే ఉద్దేశ్యంతో ఈయన ఆచి తూచి చిత్రాలకు కమిట్‌ అవుతున్నాడు. ప్రస్తుతం ‘ముద్ర’ అనే రీమేక్‌ చిత్రంలో నటిస్తున్న నిఖిల్‌ తాజాగా ఒక కాలేజ్‌కు చెందిన స్టూడెంట్స్‌ను కొట్టినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. హీరో అయిన నిఖిల్‌ కాలేజ్‌ పిల్లల పట్ట రౌడీగా ప్రవర్తించి వారిని చితక బాదినట్లుగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై నిఖిల్‌ స్పందిస్తూ తన పరువు తీసేందుకు కొందరు ఇలా చేస్తున్నారు, నా తమ్ముడి విషయంలో నేను కల్పించుకున్నాను తప్ప కొట్టలేదు అంటూ నిఖిల్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

nikil

అసలు విషయం ఏంటీ అంటే.. నిఖిల్‌ తమ్ముడు ఒక ప్రైవేట్‌ కాలేజ్‌లో చదువుతున్నాడు. అతడిని 16 మంది సీనియర్‌ స్టూడెంట్స్‌ ర్యాంగింగ్‌ పేరుతో రోజు ఇబ్బంది పెడుతున్నారట. దాంతో నిఖిల్‌ తన తమ్ముడితో కలిసి వారికి వార్నింగ్‌ ఇచ్చాడట. అయినా కూడా వారు మారక పోవడంతో పోలీసు కేసు పెట్టడం జరిగిందని నిఖిల్‌ చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆ స్టూడెంట్స్‌ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిని తాను కొట్టలేదని, అయినా కూడా కొట్టినట్లుగా ప్రచారం చేస్తున్నట్లుగా నిఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీడియాలో కూడా నేను స్టూడెంట్స్‌ విషయంలో దురుసుగా ప్రవర్తించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయం కూడా నిజం కాదు అంటూ ఈ సందర్బంగా నిఖిల్‌ చెప్పుకొచ్చాడు. సోషల్‌ మీడియాలో మాత్రం నిఖిల్‌ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హీరో అయిన నిఖిల్‌ రియల్‌ లైఫ్‌ విలన్‌ వేశాలు వేస్తున్నాడు, రౌడీలా ఫీల్‌ అవుతున్నాడు, అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

hero-nikil-movies