బాలయ్యా – రావాలయ్యా టీటీడీపీ నేతల అభ్యర్ధన…!

TDP Leaders Meets Balakrishna In Saradhi Studio

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. హైదరాబాద్ సారథి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ షూట్‌లో ఉన్న బాలయ్యను పార్టీ అధ్యక్షుడు రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లాలో గత వారం బాలయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.

tdp-leaders

ఆ ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా టీటీడీపీ నేతలు బాలయ్యకు తెలిపారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని కోరారు. స్టార్ క్యాంపెయినింగ్ కోసం ముందుకు రావాలని విన్నవించారు. అన్ని చోట్ల వీలుకాకపోతే కనీసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అయినా ప్రచారం చేయాలని కోరారు. వారి ఆహ్వానంపై బాలయ్య కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు సారథి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి కీలక సన్నివేశాలను క్రిష్ తెరకెక్కిస్తున్నారట. ముఖ్యంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించే సీన్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ సందర్భంలో పార్టీ సీనియర్ నేతలు రావుల, పెద్దిరెడ్డి ఎన్టీఆర్‌తో ఉన్న అనుబందాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాలయ్యతో పంచుకున్నారట.

balayya