చిన్మయికి మద్దతు తెలిపిన సమంత…!

Samantha Decides To Support Chinmayi ,

సినీ పరిశ్రమలో ఇటీవల లైంగిక ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. బాలీవుడ్‌లో తనూశ్రీ దత్తా నానాపటేకర్‌పై తాజాగా లైంగిక ఆరోపణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇకపోతే తమిళంలో ఇదే తరహాలో చిన్మయి కూడా పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేస్తోంది. మీటూ ఉద్యమానికి మద్దతిచ్చిన సింగర్‌ కమ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి తాజాగా ప్రముఖ కవి, రచయిత వైరముత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన స్నేహితుల పట్ల వైరముత్తు ప్రవర్తించిన తీరు అని సోషల్‌ మీడియాలో చిన్మయి పోస్ట్‌ చేసింది. చిన్మయి ఆరోపణలను కొందరు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వైరముత్తు అంతటి వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నావు అంటూ చిన్మయి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు.

chennami

చిన్మయి ప్రాణ స్నేహితురాలు, అగ్ర కథానాయిక సమంత మాత్రం చిన్మయికి తన మద్దతు తెలిపింది. ఎవరు ఏమన్నా కూడా చిన్మయి చేసింది కరెక్ట్‌ అంటూ సమంత అంటోంది. అంతేకాకుండా ‘స్టాండ్‌ విత్‌ చిన్మయి’ అంటూ సమంత తాజాగా చిన్మయికి తన మద్దతు తెలిపింది. లైంగిక వేధింపులకు గురైన వారికి అండగా ఉండాలని, అందరు కూడా మీ టూ ఉద్యమాన్ని ముందుకు నడపాలని సమంత పిలుపునిచ్చింది. సమంతతో పాటు చాలామంది సినీ తారలు కూడా చిన్మయికి మద్దతిస్తున్నారు.

Chinmayi Tweet About Che La Sow On Viral