అప్పుడే అరవింద పైరసీ… నెట్‌లో హల్‌చల్‌…!

Aravinda Sametha Movie Hulchal In Social Media

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంభోలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ల క్రేజీ కాంభో కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది. నిన్న రాత్రి నుండే ఈ చిత్ర బెనిఫిట్‌ ఫో, ప్రీమియర్‌ షోల సందడి మొదలయింది. అభిమానుల నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. టాక్‌ విషయం ఎలా ఉన్నా కూడా కలెక్షన్లు భారీగా రాబట్టడం ఖాయం అని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.

aravindha-sametha-puja-hudg

ఇటీవల సినిమాలు విడుదల కావడంతోనే అవి పైరసీ భూతంగా మారి నెట్‌లో దర్శణం ఇస్తున్నాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం మొదటి షోతోనే పైరసీ అవుతున్నాయి. గతంలో తమిళంలో ‘బాహుబలి’, ‘భరత్‌ అను నేను’, ‘సంగస్థలం’ వంటి పెద్ద చిత్రాలకు సైతం పైరసీ బాద తప్పలేదు. తాజాగా విడుదలైన ‘అరవింద సమేత’ పైరసీ కూడా నెటల్‌ హల్‌చల్‌ చేస్తోంది. కొంతమంది సినిమా చూస్తున్నాను అంటూ అతి ఆసక్తితో పలు షాట్లను ఫొటోలు తీసి, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. దాంతో సోషల్‌ మీడియాలో ‘అరవింద సమేత’ వైరల్‌ అవుతోంది. మొదటి ఆటకే ఇలా జరగడంతో నిర్మాతలు కాస్త టెన్షన్‌ పడుతున్నారు. సినిమా హాలుకు ఫోన్‌ తీసుకెళ్లవద్దు అని ఎన్టీఆర్‌ అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తొలి షోతోనే పైరసీ అవడం సినిమాపై చాలా ఎఫెక్ట్‌ పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

aravindha-sametha