బ్రేకింగ్ : బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత సతీమణి…!

Ex Dupuy CM Damodar Raja Narasimha Wife Padmini Reddy Joins In BJP

తెలంగాణ రాజకీయాలు క్షణక్షణానికి మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకూబద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు టీఆర్ఎస్‌ను ఎలాగైనా దెబ్బకొట్టాలని ఒక్కటైపోయాయి. కిందటి ఎన్నికల్లో టపీమని 10 సీట్లు కూడా గెలవని బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటోంది. ఈ వింతలు అటుంచితే ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్ ఒకటి తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి బీజేపీలో చేరారు. సామాజిక కార్యకర్తగా సేవలందిస్తోన్న పద్మినీ రెడ్డి భర్త డిప్యూటీ సీఎంగా ఉన్న కాలం నుంచే తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించేవారు.

bjp-leader
అయితే ఈ ఎన్నికల సీజన్లో ఆమె తన భర్త పనిచేస్తోన్న కాంగ్రెస్ పార్టీని కాదని కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో ఆమె సంగారెడ్డి లేదా మెదక్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పద్మినీరెడ్డి భర్త దమోదర రాజనర్సింహ ప్రస్తుతం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. భర్త అంత బాధ్యాయుతమైన స్థానంలో ఉండగా.. కాంగ్రెస్‌ను కాదని ఆమె బీజేపీలో చేరడమేంటని చెవులు కొరుక్కుంటున్నారు.

bjp-congress
కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇవ్వొద్దని వాదిస్తున్నవారిలో దామోదర రాజనర్సింహ ఒకరు. ఆయనలు ఎటూ టికెట్ ఖాయం. తన కుటంబంలోనే మరో టికెట్ అడగడం సాధ్యం కాని పరిస్థితి. ఇదే విషయాన్ని ఆయన తన సతీమణి పద్మినికి వెల్లడించారని టాక్. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా పోటీచేయాలని భావిస్తున్న పద్మిని కాంగ్రెస్‌లో ఎలాగూ సీటు రాదు కాబట్టి వేరే పార్టీలో చేరితే మంచిదని భావించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని పనిగట్టిన బీజేపీ ఆమెను వ్యూహాత్మకంగా తమవైపు తిప్పుకుందని సమాచారం. అంతేకానీ రాజనర్సింహ, పద్మిని మధ్య ఎలాంటి వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని అంటున్నారు.