ఆశక్తి రేపుతున్న విశ్వామిత్ర ట్రైలర్…!

Viswamitra-Movie-Teaser

గీతాంజలి, త్రిపుర’ వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజకిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. అదే ‘విశ్వామిత్ర’. మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రొస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మూవీ టీజ‌ర్ నుకొద్దిసేపటి క్రితం విడుదల చేసారు.

viswa-mitra

నందితా ఇందులో కథానాయికగా నటిస్తోంది. అమెరికాలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నందిత రాజ్ తో పాటు సత్యం రాజ్‌, విద్యుల్లేఖ రామన్‌, అశుతోష్ రానాలు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తుండటం విశేషం. అలాగే ఆరెక్స్ 100 సినీ రచయిత తాజుద్దీన్ సహా డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నారు. ఆసక్తి రేపుతున్న ఈ టీజర్ మీరు కూడా చూసెయ్యండి మరి.