‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్ వచ్చేసింది ..!

The trailer of 'Gitanjali is back' is here..!
The trailer of 'Gitanjali is back' is here..!

తెలుగు హీరోయిన్ అంజలి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. 2014లో కామెడీ అండ్ హార్ర‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ ‘గీతాంజలి’ సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా రాబోతుంది. ఇక ఈ మూవీ లో శ్రీనివాస్‌ రెడ్డి క‌థ‌నాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. సత్యం రాజేశ్‌, షకలక శంకర్‌, అలీ త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లేను అందిస్తుండ‌గా.. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు . ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు.. ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. అయితే తాజాగా మూవీ నుంచి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్.

The trailer of 'Gitanjali is back' is here..!
The trailer of ‘Gitanjali is back’ is here..!

మొద‌టి పార్ట్‌లో లాగానే ఈ మూవీ లో కూడా శ్రీనివాస్‌ రెడ్డి ద‌ర్శ‌కుడిగా న‌టిస్తుండ‌గా.. హార్ర‌ర్ మూవీ తీద్దామని అంజ‌లి, తన టీమ్‌తో కలిసి ఒక పాడుబ‌డిన భ‌వంతిలోకి వెళతారు. అయితే ఆ భ‌వంతీలో షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. వారికి దెయ్యాలు ఉన్న‌ట్లు అనుకొని సంఘ‌ట‌న‌లు కొన్ని ఎదురవుతుంటాయి. అయితే ఆ ఇంట్లో ఉన్న మూడు దెయ్యాలు ఎక్క‌డివి.. వారికి ఏం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే అంజలి అండ్ టీమ్ ఏం చేసింది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ట్రైలర్ ని చూడడానికి ఈ.. వీడియో క్లిక్ చేయండి .