“మెకానిక్ రాకీ” గా విశ్వక్ సేన్…ఆకట్టుకున్న ఫస్ట్ లుక్!

Vishvak Sen as “Mechanic Rocky”…impressive first look!
Vishvak Sen as “Mechanic Rocky”…impressive first look!

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Viswak Sen) చివరిసారిగా గామి (Gaami) మూవీ లో కనిపించారు. ఈ మూవీ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంది. నేడు విశ్వక్ సేన్ పుట్టిన రోజు సందర్భంగా తన 10 వ మూవీ కి సంబందించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ లని మేకర్స్ వెల్లడించాడు . కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది .

ఈ మూవీ కి మెకానిక్ రాకీ అనే టైటిల్ ని ఖరారు చేసారు. టైటిల్ పోస్టర్ ను చాలా క్రియేటివ్ గా డిజైన్ చేసారు. పోస్టర్‌లో విశ్వక్ సేన్ మాస్ మరియు పవర్ ఫుల్ అవతార్‌లో కనిపించాడు, అతను చేతిలో పెద్ద రెంచ్‌తో సిగరెట్ తాగుతూ ఉన్నాడు. గడ్డంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు . బ్యాక్‌గ్రౌండ్‌లో మెకానిక్‌ షెడ్‌ని మనం చూడవచ్చు. టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటున్నాయి. కామెడీ మరియు యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి లతో పాటుగా, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ మూవీ కి దర్శకుడు రవితేజ ముళ్లపూడి, నిర్మాత రామ్ తాళ్లూరి, ప్రొడక్షన్ బ్యానర్ SRT ఎంటర్టైన్మెంట్స్, సంగీతం జేక్స్ బిజోయ్, DOP మనోజ్ కటసాని, ప్రొడక్షన్ డిజైనర్ క్రాంతి ప్రియం, ఎడిటర్ అన్వర్ అలీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు సత్యం రాజేష్, విద్యాసాగర్ జె, కాస్ట్యూమ్ డిజైనర్ కల్యాణి, ప్రీతి జుకల్కర్ లుగా వ్యవహరిస్తున్నారు.