నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతున్న “గుంటూరు కారం”

నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతున్న
Guntur Karam

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరిల కలయికలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా గుంటూరు కారం. మరి భారీ వసూళ్లు అందుకున్న ఈ మూవీ రీసెంట్ గానే ఓటిటిలో కూడా రిలీజ్ కి వచ్చింది. పాన్ ఇండియా భాషల్లో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయగా ఇందులో ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో గుంటూరు కారం అదరగొడుతుండడం ఒక విశేషం.

నెట్ ఫ్లిక్స్ లో అదరగొడుతున్న "గుంటూరు కారం"
Guntur Karam

మరి ఈ మూవీ లేటెస్ట్ గా ఈ ఫిబ్రవరి 5 నుంచి 11 తేదీల గ్యాప్ లో అయితే గ్లోబల్ గా నాన్ ఇంగ్లీష్ మూవీ ల జాబితాలో తెలుగు వెర్షన్ లో టాప్ 6 లో అలాగే హిందీ వెర్షన్ టాప్ 10 లో ట్రెండ్ అవ్వడం విశేషం. దీనితో గుంటూరు కారం అనుకున్నట్టుగానే ఓటిటి లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.