బాక్సాఫీస్ వద్ద బాగా స్ట్రగుల్ అవుతున్న “భీమా”

Bhima is struggling at the box office
Bhima is struggling at the box office

టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, ఏ. హర్ష దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ మూవీ మార్చి 8, 2024 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. మంచి రివ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కష్టపడుతోంది. వీక్ డేస్ లో మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టడం లేదు అని చెప్పాలి.

Bhima is struggling at the box office
Bhima is struggling at the box office

దాదాపు 12 కోట్ల రూపాయల కు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ , 6 కోట్ల రూపాయల వరకు వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీకెండ్ భీమా కు కొత్త మూవీ ల రిలీజ్ లతో కూడా గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ మూవీ లో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.