టీవీ ప్రీమియర్ కు సిద్ధమైన గోపీచంద్ “భీమా”..!

Gopichand
Gopichand "Bhima" ready for TV premiere..!

టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, ఏ. హర్ష దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ మూవీ మార్చి 8, 2024 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులని అలరించడానికి రెడీ అయిపోయింది.

Gopichand "Bhima" ready for TV premiere..!
Gopichand “Bhima” ready for TV premiere..!

ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం స్టార్ మా ఛానెల్ లో మధ్యాహ్నం 1:00 గంటలకి భీమా మూవీ ప్రసారం కానున్నది . ఈ మూవీ లో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల ల్లో నటించారు. ఈ మూవీ కి రవి బస్రూర్ సంగీతం అందించారు.