ఆకట్టుకోని క్రైమ్ డ్రామా… “కిస్మత్” రివ్యూ

ఆకట్టుకోని క్రైమ్ డ్రామా... “కిస్మత్” రివ్యూ
Cinema News

విడుదల తేదీ : ఫిబ్రవరి 02, 2024

తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: నరేష్ అగస్త్య, అభినవ్ గోమతం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర మరియు రచ్చ రవి

దర్శకుడు : శ్రీనాథ్ బాదినేని

నిర్మాత: రాజు

సంగీత దర్శకులు: మార్క్ కె రాబిన్

సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్

ఎడిటింగ్: విప్లవ్ నిషాదం

నరేష్ అగస్త్య, అభినవ్ గోమతం, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించిన కిస్మత్ సినిమా నేడు థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

కథ:

మంచిర్యాల్ కి చెందిన కార్తీక్ (నరేష్ అగస్త్య), అభి (అభినవ్ గోమతం), కిరణ్ (విశ్వదేవ్ రాచకొండ) అనే ముగ్గురు నిరుద్యోగ ఇంజనీర్లు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కి వెళతారు. అయితే వీరి మార్గంలో సూరి (టెంపర్ వంశీ) అనే వ్యక్తి వస్తాడు. సూరి తన బాస్ జనార్దన్ (అజయ్ గోష్) కి చెందిన తప్పిపోయిన డబ్బు కోసం వెతుకుతున్నాడు. ప్రధాన పాత్రధారులు అయిన ముగ్గురూ అనుకోకుండా డబ్బుతో ముగుస్తారు. ఇది అనేక ప్రశ్నలకి దారి తీస్తుంది. డబ్బు ఎక్కడ ఉంది? ఈ కీలక స్టోరీ లో వివేక్ (శ్రీనివాస్ అవసరాల) పాత్ర ఏమిటి? తరువాత ఏం జరిగింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

నరేష్ అగస్త్య, అభినవ్ గోమతం మరియు విశ్వదేవ్ రాచకొండ పెర్ఫార్మెన్స్ లు చాలా బాగా ఆకట్టుకుంటాయి.

అభినవ్ గోమతం కామెడీ టైమింగ్‌, వన్ లైనర్ పంచ్ డైలాగులు బాగా ఆకట్టుకుంటాయి. అజయ్ ఘోష్ మరియు టెంపర్ వంశీ మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు.

మైనస్ పాయింట్స్:

ఛాలెంజ్ అనేది కథలోనే కాదు దాని ప్రజంటేషన్‌లో కూడా ఉంది అని చెప్పాలి. కిస్మత్‌లో సాధారణంగా క్రైమ్, కామెడీలతో ముడిపడి ఉన్న సాలిడ్ కథాంశం లేదు. అంతేకాక మంచి స్క్రీన్ ప్లే ఉండి ఉంటే స్టోరీ లైన్ బాగా ఎలివేట్ అయ్యి ఉండేది.

మూవీ లో కొన్ని సన్నివేశాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. రియా సుమన్ పాత్ర కూడా లిమిట్ గా ఉండటం మైనస్ అనే చెప్పాలి.

ఆకట్టుకోని క్రైమ్ డ్రామా... “కిస్మత్” రివ్యూ
Kismat Movie

కామెడీ సన్నివేశాలు, సస్పెన్స్ ను కలిగించే కొన్ని ఎఫెక్ట్స్ కోసం అనవసరమైన డ్రామాను పెట్టడం జరిగింది. దీంతో ఫస్ట్ హాఫ్ చాలా స్లో గా సాగుతుంది. రన్‌టైమ్ మంచిగానే ఉన్నప్పటికీ, మూవీ మరి డల్ గా కొనసాగుతుంది.

శ్రీనివాస్ అవసరాల, రియా సుమన్‌ ల పాత్రలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొలేదు. అంతేకాక వీరి పాత్రలు మూవీ కి తక్కువ విలువ కలిగి ఉండేలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం:

కిస్మత్‌ ని మంచి ఎంటర్ టైనర్ గా మార్చగలిగే అద్భుతమైన స్క్రీన్‌ప్లేను రూపొందించే అవకాశాన్ని రచయిత మరియు దర్శకుడు కోల్పోయారు అని చెప్పాలి.

మార్క్ కె రాబిన్ సంగీతం మరియు సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అయితే మూవీ పై అంత ప్రభావాన్ని చూపలేక పోయాయి. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్ గా ఉండే అవకాశం ఉంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నా, ఇంకా బెటర్ గా ఉండే అవకాశం ఉంది.

తీర్పు:

మొత్తం మీద, కిస్మత్ సినిమా రొటీన్ క్రైమ్ డ్రామా గా నిలిచింది. మూవీ లో ప్రధాన నటీనటుల ఆకట్టుకొనే పెర్ఫార్మెన్స్ లు ఉన్నప్పటికీ, పేలవమైన స్క్రీన్‌ప్లే మూవీ ఫలితం ని దెబ్బ తీసింది. డల్ గా సాగే ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ వారాంతం మూవీ ను స్కిప్ చేయవచ్చు.