బ్రహ్మరాక్షసుడు వచ్చాడు..ఈ సారి గోపీచంద్ గట్టి ప్లానే..!

బ్రహ్మరాక్షసుడు వచ్చాడు..ఈ సారి గోపీచంద్ గట్టి ప్లానే..!
Cinema News

టాలీవుడ్ హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో, ఏ. హర్ష రచన, దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ మూవీ ని ఫిబ్రవరి 16, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబందించిన టీజర్ ని నేడు రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాక్షసులను వేటాడే, బ్రహ్మ రాక్షసుడు వచ్చాడు అంటూ హీరో ని టీజర్ లో ఎలివెట్ చేసే డైలాగ్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. హీరో గోపీచంద్ ని టీజర్ లో చూపించిన విధానం పవర్ ఫుల్ గా ఉంది.

బ్రహ్మరాక్షసుడు వచ్చాడు..ఈ సారి గోపీచంద్ గట్టి ప్లానే..!
Gopichand

ఈ మూవీ లో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ కి కేజీఎఫ్, సలార్ చిత్రాలకి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.