ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గోపిచంద్ “భీమా”?

Gopichand
Gopichand "Bheema" fixed OTT release date?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపిచంద్ హీరోగా మాళవిక శర్మ హీరోయిన్ గా కన్నడ మాస్ దర్శకుడు హర్ష తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ మూవీ నే “భీమా”. మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ రిలీజ్ అయ్యిన ఈ మూవీ గోపిచంద్ కెరీర్ లో మరో సాలిడ్ మాస్ ప్రాజెక్ట్ గా నిలిచింది. అయితే ఈ శివరాత్రి కానుకగా వచ్చిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

Gopichand "Bheema" fixed OTT release date?
Gopichand “Bheema” fixed OTT release date?

దీని ప్రకారం ఈ మూవీ ఈ ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టుగా వినికిడి. ఈ మూవీ ఓటీటీ హక్కులు స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో ఆరోజు నుంచి రానున్నట్టుగా సమాచారం. ఇక దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ మూవీ కి రవి బసృర్ సంగీతం అందించగా వెన్నెల కొషోర్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే శ్రీ సత్యసాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.