‘మహేష్’ చేతుల మీదుగా హరోం హర ట్రైలర్..ఎప్పుడంటే…?

Harom Hara trailer by 'Mahesh' when...?
Harom Hara trailer by 'Mahesh' when...?

సుధీర్ బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 14, 2024న రిలీజ్ కాబోతుంది. ఐతే, రేపు ఉదయం 11:25 గంటల సమయానికి సూపర్ స్టార్ మహేష్ బాబు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తారని ఈరోజు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా తెలిపారు . సినిమాపై అంచనాలు పెరగాలంటే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండాలి. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

Harom Hara trailer by 'Mahesh' when...?
 

మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా లో సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు నటించారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సుమంత్ జీ. నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.