గోపీచంద్ “విశ్వం” ఫస్ట్ లుక్ రిలీజ్!

Gopichand
Gopichand "Viswam" first look release!

టాలీవుడ్ హీరో గోపీచంద్ చివరిసారిగా, కన్నడ డైరెక్టర్ హర్ష దర్శకత్వం లో తెరకెక్కిన భీమా మూవీ లో కనిపించారు. ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ హీరో తదుపరి శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్నారు. ఉగాది పండుగ రోజున మేకర్స్ ఫస్ట్ స్ట్రైక్ ని ఏప్రిల్ 11, 2024 న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే మూవీ కి విశ్వం అనే టైటిల్ ని ఖరారు చేస్తూ, ఫస్ట్ స్ట్రైక్ ని రిలీజ్ చేశారు.

Gopichand "Viswam" first look release!
Gopichand “Viswam” first look release!

ఫస్ట్ స్ట్రైక్ పేరిట రిలీజ్ చేసినటువంటి వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంచి విజువల్స్ తో, ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అలరించింది. గోపీచంద్ మేకోవర్ అందరిని ఆకట్టుకుంటుంది. భీమా తర్వాత మరో పవర్ ఫుల్ రోల్ తో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మిస్తున్న ఈ మూవీ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఛైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.