సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చిన ‘గం గం గ‌ణేశా’మూవీ !

'Gam Gam Ganesha' movie that came to OTT silently!
'Gam Gam Ganesha' movie that came to OTT silently!

యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించిన రీసెంట్ సినిమా ‘గం గం గ‌ణేశా’ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. మే 31న రిలీజ్ అయిన ఈ మూవీ ను ఉద‌య్ బొమ్మిశెట్టి డైరెక్ట్ చేశారు. పూర్తి క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీ ప్రేక్ష‌కులను అల‌రించింది. అయితే, ఈ మూవీ ఓటిటిలో ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎదురుచూశారు.

అంద‌రికీ స‌ర్ ప్రైజ్ ఇస్తూ, ‘గం గం గ‌ణేశా’ సినిమా సైలెంట్ గా ఓటిటిలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ప్ర‌ముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ గురువాం నుండి స్ట్రీమింగ్ అవుతుంది . దీంతో ఈ మూవీ ను చూసేందుకు ఆడియెన్స్ ఆస‌క్తిని చూపుతున్నారు.

'Gam Gam Ganesha' movie that came to OTT silently!
‘Gam Gam Ganesha’ movie that came to OTT silently!

ఇక ఈ మూవీ లో న‌య‌న్ సారిక‌, ప్ర‌గ‌తి శ్రీ‌వాస్త‌వ హీరోయిన్లుగా న‌టించ‌గా.. వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయెల్, రాజ్ అర్జున్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల ల్లో న‌టించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించిన ఈ మూవీ కు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ ల‌భిస్తుందో చూడాలి.