TS Politics: మేడారం జాతర వచ్చే భక్తులకు శుభవార్త…

TS Politics: Good news for devotees coming to Medaram Jatara
TS Politics: Good news for devotees coming to Medaram Jatara

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే త్వరలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నది.ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి 29 వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తున్నట్లు అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి అన్నారు.

దీంతో మేడారం జాతరకు వచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారంల నుంచి వచ్చే వాహనాల ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్టిక్‌ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ ఉపయోగిస్తోంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్జప్తి మేరకు జాతర ముగిసే దాకా ఈ ఫీజు వసూలు నిలిపివేయనున్నారు.