ఓటీటీలోకి ‘బబుల్‌గమ్‌’మూవీ . . స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘బబుల్‌గమ్‌’మూవీ . . స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Cinema News

యాంకర్ సుమ-రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ కనకాల హీరోగా పరిచయమైన మూవీ బబుల్‌గమ్‌. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్‌ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలై యూత్ ను ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు రెడీ అయింది.

ఓటీటీలోకి ‘బబుల్‌గమ్‌’మూవీ . . స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Bubblegum

థియేటర్లో విడుదలైన 40 రోజుల తర్వాత బబుల్ గమ్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సందర్భంగా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ని తాజాగా ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుంచి బబుల్ గమ్ మూవీ ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది. ఈ వివరాలు వెల్లడిస్తూ ఆహా పోస్టర్‌ విడుదల చేసింది. రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో ఆదిగా నటించి అలరించాడు రోషన్‌. తన ప్రేయసి జాహ్నవి పాత్రలో మానస చౌదరి ఆకట్టుకుంది. చైతూ జొన్నలగడ్డ, హర్ష, అను హాసన్‌, కిరణ్‌ మచ్చా తదితరులు కీలక పాత్రలు పోషించారు.