గుడ్ న్యూస్ : రీ రిలీజ్ కి సిద్దమైన “ఓయ్ !”

గుడ్ న్యూస్ : రీ రిలీజ్ కి సిద్దమైన “ఓయ్ !”
Cinema News

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది. సూపర్ హిట్ అయిన పలు మూవీ లు రీ రిలీజ్ అవుతూ, ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. ఇప్పుడు మరొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఓయ్ ! రీ రిలీజ్ కు రెడీ అయిపోయింది. ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ ని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ OG మరియు నాని యొక్క సరిపోదా శనివారం మూవీ లను నిర్మిస్తున్న DVV దానయ్య బ్యాంక్రోల్ చేసారు. సిద్దార్థ్ మరియు షామిలి నటించిన ఈ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను అలరించింది.

గుడ్ న్యూస్ : రీ రిలీజ్ కి సిద్దమైన “ఓయ్ !”గుడ్ న్యూస్ : రీ రిలీజ్ కి సిద్దమైన “ఓయ్ !”
Oye Movie

వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14, 2024న ఈ మూవీ ని మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి దానికి ఎలాంటి స్పందన లభిస్తుందనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రముఖ నటులు సునీల్, అలీ, నెపోలియన్, ప్రదీప్ రావత్, కృష్ణుడు తదితరులు కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించారు.