SSMB 29 లో మహేష్ బాబు ఎంట్రీ ఎప్పుడంటే..?

SSMB 29 లో మహేష్ బాబు ఎంట్రీ ఎప్పుడంటే..?
Mahesh Babu 2898 AD

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా అయిన SSMB 29 కోసం యావత్ ప్రపంచమంతా కూడా ఇప్పటినుండే ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. తొలిసారిగా మహేష్ తో రాజమౌళి తెరకెక్కించనున్న ఈ భారీ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ సినిమా గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా రూపొందనుంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ సినిమా కి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ సినిమా లోని తన పాత్ర కోసం ఫిట్నెస్ పరంగా కసరత్తులు మొదలెట్టారు మహేష్. ఇటీవల జర్మనీ వెళ్లిన మహేష్, అతి త్వరలో ఇండియాకి తిరిగిరానున్నారని, అనంతరం మూడు యాడ్ షూట్స్ లో పాల్గొని, ఆ తరువాతనే SSMB 29 సినిమా లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. అయితే పక్కాగా ఈ సినిమా యొక్క అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు షూట్ మొదలెడతారు అనేదాని పై జక్కన్న అండ్ టీమ్ నుండి క్లారిటీ కూడా రావాల్సి ఉంది.