ఓయ్! సినిమా డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!

ఓయ్! సినిమా డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
Cinema News

టాలెంటెడ్ యాక్టర్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఆనంద్ రంగ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఓయ్. ఈ మూవీ 2009 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లని రాబట్టలేక పోయినా, మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా మూవీ నిలిచింది. అయితే ఈ మూవీ ను వాలెంటైన్స్ డే సందర్భంగా మేకర్స్ నేడు రీ రిలీజ్ చేయడం జరిగింది.

ఓయ్! సినిమా  డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
Oye Movie

ఈ రీ రిలీజ్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియెన్స్ పలు క్లిప్ లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆనంద్ రంగ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశారు. గూస్ బంప్స్, హ్యాపీ టియర్స్, లవ్ యూ ఆల్ అని అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షామిలి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా అద్దిరిపోయే సంగీతాన్ని అందించారు.