Crime: ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు పత్తివేత

Crime: Large scale ganja chocolate cotton harvesting in Prakasam district
Crime: Large scale ganja chocolate cotton harvesting in Prakasam district

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. సెబ్ సీఐ మారయ్య బాబు తెలిపిన వివరాల మేరకు… బిహార్కు చెందిన యువకుడు రమేష్ సహాని బూదవాడ పంచాయతీ పరిధిలోని ఎల్లయ్య నగర్లో గ్రానైట్ కంపెనీల సమీపంలో బడ్డీకొట్టు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ఇతర ప్రాంతాలనుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి ఇక్కడి పరిశ్రమల్లోని కార్మికులకు విక్రయించేవాడు. అందిన సమాచారం మేరకు అధికారులు మంగళవారం బడ్డీకొట్టులో తనిఖీ చేయగా 3480 గ్రాముల గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వాటి విలువ రూ.10వేల వరకు ఉంటుందని సీఐ తెలిపారు.