‘భారతీయుడు – 2’ రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్ ..!

‘భారతీయుడు – 2’ రిలీజ్ పై లేటెస్ట్ అప్ డేట్ ..!
Cinema News

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న తాజా పాన్ ఇండియన్ సినిమా భారతీయుడు 2. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్దార్ధ, బాబీ సింహా, ఎస్ జె సూర్య తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబందించి కొన్నాళ్లుగా పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతుండగా లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం భారతీయుడు 2 సినిమా ని మే లో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అలానే దీని పై మేకర్స్ నుండి వచ్చే నెలలో పక్కాగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందట . అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ని రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి.