గుడ్ న్యూస్ :‘ఓజీ’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ ..అందులో ఏ మాత్రం మార్పు లేదు

Good news: 'Oji' movie release date fixed .. there is no change in it
Good news: 'Oji' movie release date fixed .. there is no change in it

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూవీ ఓజి.. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టార్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా తెరకెక్కుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ పైన ఉన్నంత బజ్ పవన్ నటిస్తున్న ఇంకే మూవీ పైన లేదని చెప్పాలి. ఇకపోతే షూటింగ్ అప్డేట్, లొకేషన్ అప్డేట్స్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి విషయంపై కూడా ఎప్పటికప్పుడు అభిమానులకు కిక్కిచ్చే వార్తలను మేకర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు .

Good news: 'Oji' movie release date fixed .. there is no change in it
Good news: ‘Oji’ movie release date fixed .. there is no change in it

ఇదిలా ఉంటే… ‘ఓజీ’ మూవీ విడుదల తేదీపై నిర్మాత డీవీవీ దానయ్య మరోసారి క్లారిటీ ఇచ్చారు. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 27న ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. పవన్ హిట్ మూవీ ల్లో ఒకటైన ‘అత్తారింటికి దారేది’ కూడా 2013 సెప్టెంబరు 27నే విడుదలైంది. ఇప్పుడు అదే తేదీన ‘ఓజీ’ కూడా రానుండటంతో అభిమానులు సంబరపడుతున్నారు.