Election Updates: తెదేపా కండువా కప్పుకున్న వైకాపా ఎమ్మెల్యే సోదరుడు

Election Updates: Tedepa is the brother of Vaikapa MLA covered with a scarf
Election Updates: Tedepa is the brother of Vaikapa MLA covered with a scarf

నంద్యాల జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో బనగానపల్లి తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువా కప్పి చంద్రశేఖరరెడ్డిని తెదేపాలోకి ఆహ్వానించారు.

జనార్దన్ రెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపునకు కృషి చేయాలని, భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ అధినేత ఆయనకు సూచించారు. అనంతరం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ 1994లో తెదేపా నుంచి తన అన్న కాటసాని రాంభూపాల్ రెడ్డిపై (కాంగ్రెస్) పోటీ చేశానని, తిరిగి సొంతగూటికి చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.