Election Updates: వై ఎస్ షర్మిల మాటలకు స్పందించిన తెదేపా నేత బీటెక్ రవి

Election Updates: TDP leader BTech Ravi responded to YS Sharmila's words
Election Updates: TDP leader BTech Ravi responded to YS Sharmila's words

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెదేపా నేత బీటెక్ రవి అన్నారు. ఈ హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసినట్లు చెప్పారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘బాబాయ్ హత్య గురించి షర్మిల కుండబద్దలు కొట్టారు. తనను ఎంపీగా పోటీ చేయించేందుకు చిన్నాన్న ఒత్తిడి తెచ్చారని ఆమె చెప్పారు. గతంలో కడప ఎంపీగా పోటీకి ఆమె ఒప్పుకొన్నట్లు జగన్కు వివేకా తెలిపారు. ఆ తర్వాత అంతఃపుర రహస్యం ఏం జరిగిందో? పోటీకి షర్మిల అంగీకరించాక ఆయన హత్యకు కుట్ర జరిగింది. అవినాష్రెడ్డికి సిగ్గు ఉంటే ఎంపీ బరి నుంచి తప్పుకోవాలి. వివేకాను హత్య చేసిన వ్యక్తిని షర్మిలపై పోటీకి నిలిపారు. రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ వైకాపా. హంతకులు జగన్ చుట్టే తిరుగుతున్నారు.’’ అని బీటెక్ రవి అన్నారు.