అరవింద సమేత వీర రాఘవ రివ్యూ & రేటింగ్ – తెలుగు బుల్లెట్…!

Aravindha-Sametha-Movie-Review

నటీనటులు : ఎన్టీఆర్, పూజా హెగ్డే
సంగీతం : ఎస్.ఎస్.థమన్
నిర్మాణం : హారిక & హాసినీ క్రియేషన్స్
నిర్మాత : ఎస్.రాథాకృష్ణ (చిన బాబు)
రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

aravindha-sametha-puja-hudg

ఎన్టీఆర్ వెనుక మూడు విజయాలు, త్రివిక్రమ్ వెనుక ఓ భారీ పరాజయం …వెరసి ఈ ఇద్దరూ కలిసి తొలిసారిగా ఓ సినిమా చేస్తున్నారు అనగానే సామాన్య సినీ ప్రెకషకుల్లోనే కాదు మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. అంచనాలు పెంచేసుకుంది. ఈ అంచనాల మధ్య విడుదల అయిన అరవిందసమేత వీరరాఘవ ఎలా వుందో చూద్దామా !

కథ…

పేకాట దగ్గర 5 రూపాయల కోసం రాయలసీమలోని రెండు ఊళ్ళ మధ్య మొదలైన ఫ్యాక్షన్ గొడవలు బసిరెడ్డి ( జగపతిబాబు ) , నారపరెడ్డి( నాగబాబు) కుటుంబాల మధ్య వైరంగా మారుతుంది. 30 సంవత్సరాలుగా నడుస్తున్న ఆ గొడవల వల్ల కొడుకు వీరరాఘవరెడ్డి ( ఎన్టీఆర్ ) చూస్తుండగానే నారపరెడ్డిని బసిరెడ్డి మనుషులు చంపేస్తారు. దీంతో కత్తిబట్టిన వీరరాఘవరెడ్డి నాయనమ్మ మాటలతో హింసకి దూరంగా వెళ్లాలని బయలుదేరతాడు. ఆ సమయంలో అరవింద ( పూజ హెగ్డే ) తో ప్రేమలో పడతాడు. ఆమె మాటల వల్ల తన సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందని ఫీల్ అయిన వీరరాఘవకి శాంతి సాధించే క్రమంలో అనూహ్య పరిస్థితులు ఎదురు అవుతాయి. శాంతి తో పాటు ప్రేమ కూడా ఓ సవాల్ గా మారుతుంది. ఆ సమయంలో వీరరాఘవరెడ్డి ఏం చేసాడు ? చివరకు ఏమి అయ్యింది అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ…

puja in aravindha movie

దర్శకుడిగా తెలుగు సినిమా స్థాయిని ని పెంచిన వారిలో త్రివిక్రమ్ కూడా ఒక్కరు అనడంలో ఏ సందేహం లేదు. అలాంటి త్రివిక్రమ్ మొన్నామధ్య అజ్ఞాతవాసి లాంటి ప్లాప్ సినిమా తీసాడు. తిరిగి ట్రాక్ ఎక్కేందుకు అరవిందసమేత వీరరాఘవ ని తెరకు ఎక్కించాడు. ఈ క్రమంలో ఓ మంచి, ఓ చెడు కనిపించాయి. ఇంతకుముందు సినిమాల్లో లాగా కధాగమనంలో వినోదానికి పెద్దపీట వేయడానికి ట్రాక్ దాటినట్టు అనిపించేది. ఈసారి మాత్రం పూర్తిగా కధకి కట్టుబడి కధనం నడిపించారు. అది మంచి అనుకుంటే ఆ జాగ్రత్తలో కధనం కొద్దిగా స్లో గా సాగడం చెడు. ఇక అరవిందసమేత విషయానికి వస్తే తొలి 20 నిమిషాల్లోనే కథ ఏంటన్నది అర్ధం అయిపోతుంది. అప్పటినుంచి సమస్యకు పరిష్కారం కోసం హీరో వెదుకుతూ ఉంటాడు. క్లైమాక్స్ లో కూడా ఇదీ పరిష్కారం అని చెప్పలేని పరిస్థితిలో హీరో ఉంటాడు.

aravindha-sametha-movie-release

కధకి సెంట్రల్ పాయింట్ ఎక్కడడి అక్కడే ఉండటం మైనస్ అనిపిస్తుంది. ఇక మైనస్ ని అధిగమించడానికి ఫ్యాక్షన్ కధకి సమాంతరంగా నడిచే హీరో , హీరోయిన్ ప్రేమ కథ ఆసక్తికరంగా సాగుతుంది. అక్కడ త్రివిక్రమ్ విజృంభణ కనిపిస్తుంది. బలమైన హీరోయిన్ పాత్ర , బలమైన హీరో పాత్ర మధ్య సంఘర్షణ బాగా క్రియేట్ చేయగలిగాడు దర్శకుడు. ఆ క్రమంలో ఆడ,మగ సంబంధాల మీద త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ సూపర్ . అయితే ఆ ప్రేమకథ కాన్ఫ్లిక్ట్ కొనసాగించివుంటే కథ ,కధనం కి బలంతో పాటు టైటిల్ కి సార్ధకత ఉండేది. హీరోయిజం పెంచే క్రమంలో త్రివిక్రమ్ చేసిన కొన్ని ఎత్తుగడలు పాతగానే అనిపిస్తాయి.

aravindha-sametha-movie-ntr

అయితే ఆయన పెన్ కి వున్న పవర్ తో ఆ లోటు పెద్దగా కనబడదు. మొత్తానికి అరవిందసమేత త్రివిక్రమ్ కోణంలో ఓ నిజాయితీ కలిగిన ప్రయత్నమే. కానీ అదే త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరో నోట ఓ డైలాగ్ పలికిస్తాడు… “ చెప్పే వాళ్ళని బట్టి , చెప్పే సమయాన్ని బట్టి విషయం విలువ పెరుగుతుంది “ అని. ఈ డైలాగ్ లాగానే ఫ్యాక్షన్ ఈ సినిమాకి సెంట్రల్ పాయింట్ కావడంతో , ఇప్పటికే ఈ తరహాలో ఎన్నో సినిమాలు చూసిన ప్రేక్షకులు పాత విషయం చూస్తున్న ఫీలింగ్ రావడం ఈ సినిమాకి కాస్త మైనస్. అయితే త్రివిక్రమ్ మార్క్ చమక్కులు, డైలోగ్స్ తో పాటు ఎన్టీఆర్ నటన ఆ లోటు తెలియనివ్వదు.

aravundha sametha movie

ఎన్టీఆర్ నటన గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏముంది ? వీరరాఘవరెడ్డి గా సినిమా ఫస్ట్ షాట్ నుంచి ఎండింగ్ దాకా తన నటనతో ప్రేక్షకుల గుండెల్ని తడిమాడు. ఓ ఉడుకు రక్తం కలిగిన కుర్రోడిగా , ప్రేమికుడిగా , బాధ్యత కోసం పోరాడే కొత్తతరం ప్రతినిధిగా ఎన్టీఆర్ సూపర్ గా చేసాడు. ఆయన ఫాన్స్ ఆశించే యాక్షన్ సీక్వెన్స్ ల్లో ఎన్టీఆర్ వీరవిహారం చేసాడు. ఇక డాన్స్ కూడా సూపర్. ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ పూజ , విలన్ జగపతిబాబు పాత్రలు ఎప్పటికీ గుర్తు ఉండిపోతాయి. ఇక నవీన్ , ఈశ్వరి రావు నటన సూపర్. ఇక సాంకేతిక నిపుణుల విభాగానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ , కెమెరా మెన్ వినోద్ తో పాటు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ల ప్రతిభ ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది.

తెలుగు బులెట్ పంచ్ లైన్…”అరవిందసమేత వీరరాఘవ “ పై త్రివిక్రమ్ , ఎన్టీఆర్ ల ఇద్దరి ముద్ర పడటంతో …
తెలుగు బులెట్ రేటింగ్ …3 /5 .