గుడ్ న్యూస్ : ” పుష్ప-2 ది రూల్ ” టీజర్ అదిరిపోయింది ..!

Good news:
Good news: "Puspa-2 The Rule" teaser is out!

పుష్ప ది రైజ్ (Pushpa the rise) సినిమా తో సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). ఈ మూవీ బన్నీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ మూవీ కి సీక్వెల్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది . ఐకాన్ స్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుండగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సెన్సేషన్ రెస్పాన్స్ వచ్చింది.

Good news: "Puspa-2 The Rule" teaser is out!
Good news: “Puspa-2 The Rule” teaser is out!

నేడు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఉదయం 11:07 గంటలకు టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ పవర్ ఫుల్ గా అదరగొట్టింది. బన్నీ మేకోవర్ సూపర్ గా ఉంది . విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్ ని వేరే లెవెల్ లో చూపించింది. ఫ్యాన్స్ కు సిసలైన ట్రీట్ దక్కింది అని చెప్పాలి. జాతర సీక్వెన్స్ కు సంబందించిన కొన్ని కట్స్ ని టీజర్ గా రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్ లేకుండానే పవర్ ఫుల్ ఫైట్ తో ఉన్న టీజర్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. టీజర్ తో మూవీ పై అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పాలి. ఆగస్ట్ 15, 2024 న మూవీ రిలీజ్ కానున్నట్లు మరోసారి ప్రకటించారు మేకర్స్.

టీజర్ ని మీరు కూడా చుడండి …