National Politics: లోక్ సభ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రశాంత్ కిషోర్

National Politics: Prashant Kishore made sensational comments on the Lok Sabha election results
National Politics: Prashant Kishore made sensational comments on the Lok Sabha election results

లోక్ సభ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పలు రాష్ట్రాల్లో ఓట్ షేరింగ్ పై మాట్లాడుతూ.. తెలంగాణలో ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పు, దక్షిణ భారతదేశాల్లో బీజేపీ సీట్ల సంఖ్యను పెంచుకుంటుందని అన్నారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ షేర్ గణనీయంగా పెరుగుతుందని, సీట్ల గురించి తెలియదు కానీ, తమిళనాడులో శాతం పరంగా చూస్తే డబుల్ డిజిట్ ను చూస్తామని అన్నారు.

అలాగే తెలంగాణలో బీజేపీ మొదటి లేదా రెండో పార్టీ అవుతుందని, ఇది వారికి చాలా గొప్ప విషయమని అన్నారు. ఒడిషాలో ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు. అంతేగాక అందరూ ఆశ్చర్చపోయేలా పశ్చిమ బెంగాల్ లో కూడా మొదటి స్థానం వచ్చే అవకాశం ఉందని, 17 స్థానాల్లోనే పోటీ చేసినా స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బీజేపీ అనుకున్నట్లు వారికి 370 స్థానాలు రావడం కష్టమే కానీ, సీట్లు మాత్రం గతంలో కంటే పెరుగుతాయని స్పష్టం చేశారు.