నీ వెనకాలే నడిచి – విజయ్ దేవరకొండ ఫస్ట్ మ్యూజిక్ వీడియో

Nee-Venakale-Nadichi-Music-

విజయ్ దేవరకొండ మరోసారి అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఈ మధ్యే విడుదలైన టాక్సీవాలా సినిమా సక్సెస్ తో. ఈ సినిమా పైరసీ కాపీ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న, సినిమాకి వచ్చిన మాంచి మౌత్ టాక్ తో కలెక్షన్లు సాధిస్తూ, విజయపథాన దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ చేస్తున్న పబ్లిసిటీ కూడా విభిన్నంగా ఉండి, అందరిని ఆకర్షిస్తుంది. ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భం ని పురస్కరించుకొని, కొన్ని నెలల ముందు తమిళంలో విడుదలైన విజయ్ దేవరకొండ ఫస్ట్ మ్యూజిక్ వీడియో ని ఇప్పుడు అనువదించి “నీ వెనకాలే నడిచి” అనే లిరిక్ ని జతచేసి, నిన్న ఆ సాంగ్ తెలుగు వెర్షన్ ని విడుదల చేశారు.

vijayadevarakonda
ఈ పాట కి అనంత శ్రీరామ్ రచన చేయగా, సింగర్ చిన్మయి ఎంతో మధురంగా పాడింది. సౌరభ్ & దుర్గేష్ అందించిన సంగీతం కూడా ఈ పాట ని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేసింది. ఈ మ్యూజికల్ వీడియోలో కూడా విజయ్ దేవరకొండ రాయల్ ఎంఫీల్డ్ బైక్ పైన వచ్చి, సైకిల్ పైన వస్తున్న మలోబికా ని గుద్దేసి, అంతలోనే తనతో స్నేహం చేసి, ఆ స్నేహం ప్రేమగా మారాక, తనకి ప్రపోస్ చేయడం అంతా విజువల్ గా చాలా బాగుంది. ఇందులో నటించిన మలోబికా తన ప్రెట్టి గర్ల్ అనే ప్రైవేట్ ఆల్బం తో ఎంతో పేరు తెచ్చుకుంది. కానీ, ఆ ప్రెట్టి గర్ల్ వీడియోలో కనిపించిన హాట్ నెస్ కి విభిన్నంగా ఈ మ్యూజిక్ వీడియో లో చాలా అందంగా కనిపించింది. భాను శ్రీ తేజ డైరెక్షన్ కి తోడు సూర్య సినిమాటోగ్రఫీ కనులకి ఇంపుగా అనిపించాయి.