అన్న కోసం మైత్రిని కోరిన ఎన్టీఆర్‌…!

Jr Ntr Support To Kalyan Ram

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సినిమా కెరీర్‌ ప్రారంభించి దశాబ్ద కాలం దాటి చాలా కాలం అయ్యింది. అయినా ఇన్నాళ్లు పెద్ద సక్సెస్‌ లేకుండా, పెద్దగా స్టార్‌డం దక్కించుకోకుండా కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. ఏమాత్రం ఆకట్టుకోని కథలు తీసుకుంటూ ఈయన సినిమాలు చేస్తున్నాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు రెండు మూడు సినిమాలు మినహా ఏ ఒక్కటి కూడా మినిమం సక్సెస్‌ను అందుకోలేక పోయాయి. ఈయనకు తమ్ముడు ఎన్టీఆర్‌ సాయం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎన్టీఆర్‌ అన్న సక్సెస్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా కూడా తన అన్న కోసం ఒక మంచి సినిమాను తీయాలంటూ మైత్రి మూవీస్‌ నిర్మాతలను కోరినట్లుగా సమాచారం అందుతోంది.

kalyanram

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి వారు ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ కోసం ఒక కథను సిద్దం చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో వచ్చిన సినిమాకు మంచి గిరాకీ ఉండటంతో పాటు మంచి సక్సెస్‌లను దక్కించుకుంటున్నాయి. అందుకే అన్న కోసం ఒక సినిమాను చేయమని మైత్రి నిర్మాతలను ఎన్టీఆర్‌ కోరడం జరిగిందట. చాలా కాలంగా సినిమాలు వరుసగా ఫ్లాప్‌ అవుతున్న కారణంగా కళ్యాణ్‌ రామ్‌ చిన్న గ్యాప్‌ తీసుకున్నాడు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో హరికృష్ణ పాత్రను పోషిస్తున్న కళ్యాణ్‌ రామ్‌ మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఆ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం కూడా కళ్యాణ్‌ రామ్‌కు పెద్దగా సక్సెస్‌ తెచ్చి పెడుతుందనే నమ్మకం లేదు. మరి ఎన్టీఆర్‌ సిఫార్స్‌ మేరకు మైత్రి మూవీస్‌ వారు నిర్మించబోతున్న సినిమా అయినా కళ్యాణ్‌ రామ్‌కు సక్సెస్‌ను తెచ్చి పెట్టి, కెరీర్‌ను నిలబెడుతుందేమో చూడాలి.

kalyan-ntr