మోడీ దెబ్బకి రిటయిరవుతున్న మంత్రులు…!

Sushma-Swaraj-Declared-Reti

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఈరోజు ఓ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని ఈరోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలా వద్దా అనేది మామూలుగా పార్టీ నిర్ణయిస్తుందని, కానీ, ఆరోగ్య పరమైన కారణాల వలన పోటీ చేయకూడదని ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ప్రస్తుతం సుష్మా విదిషా లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న నమ్మకం సొంత పార్టీ నేతలకు కూడా లేకనే ఇలా ప్రకటనలు వస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కొంత మంది కేంద్రమత్రులు లంచాలు తీసుకుని దొరికిపోతూంటే.. మరికొంత మంది మంత్రులు అస్తృసన్యాసం చేస్తున్నారు.

Sushma-Swaraj

ఓ దశలో ప్రధానమంత్రి పదవికి పోటీ పడిన సుష్మాస్వరాజ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ప్రకటించడం కూడా ఈ కోవలోకే చెందుతుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీలో జరుగుతున్న పరిణామాలు మోడీ వ్యవహారశైలి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని వచ్చే ఎన్నికల్లో పరువు పోతుందని తెలిసి జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అయితే అనారోగ్య కారణాలతోనే రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు కానీ అసలు కారణం మాత్రం మోదీ వ్యవహరశైలినే అని భావిస్తున్నారు.సుష్మాస్వరాజ్ కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉన్నారు. కానీ ఆమె పనులన్నీ మోడీనే చేస్తూంటారు. ప్రపంచంలో భార విదేశాంగ మంత్రి ఎవరు అంటే.. చాలా సులువుగా అందరూ మోడీ పేరే చెబుతారు. అంతగా ఆయన విదేశాలు తిరిగారు. దౌత్య వ్యవహారాలు నడిపారు. ఆ పర్యటనల వల్ల దేశానికి వచ్చిన లాభమేం లేదు అయినప్పటికీ సుష్మాస్వరాజ్ ను రబ్బర్ స్టాంప్ ని చేసి పక్కన పడేశారు. దాంతో ఆమె ట్విట్టర్ లోనే పని చేసేవారు. ట్విట్టర్ లో ఎవరైనా సమస్యలు చెప్పుకుంటే వాటిని పరిష్కరించి మీడియాలో పబ్లిసిటీ చేసుకును ట్విట్టర్ మినిస్టర్ గా పేరు సంపాదించారు.