స్టేజ్ ల మీదకి కూడా ఇంతింత బట్టలతో వస్తున్నారు…!

SP Balasubrahmanyam Shocking Comments On Tollywood Heroines Dressing

తెలుగు నేల మీద ఎస్పి బాలసుబ్రమణ్యం పేరు తెలియని వారు ఉండరు. బాషా బేధం లేకుండా వేల పాటలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. కొత్త గాయకుల తాకిడిలో వయసు రిత్యా ఎక్కువ పాడలేకపోతున్న బాలు టీవీ కార్యక్రమాలు స్టేజి షోల ద్వారా కనుమరుగవుతున్న మధురమైన సంగీతాన్ని బ్రతికించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలాంటి బాలు తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో హీరోయిన్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఏమైనా అంటే ఇంగ్లీష్ సినిమాల్లో చూపించేవే కదా అంటూ సమర్ధించుకుంటున్నారని అయితే వాళ్ళు బాత్ రూమ్ లో జరిగేవి చూపిస్తే అవి కూడా తెలుగు సినిమాల్లో చూపిస్తారా అంటూ ఆయన నిప్పులు చెరిగారు. పొట్టి దుస్తులు వేసుకుంటేనే నిర్మాతలు అవకాశాలు ఇస్తారనే భ్రమలో ఏకంగా స్టేజిల మీద కూడా కురచ దుస్తులతో వస్తున్నారని ఇంత కంటే సిగ్గుపడాల్సిన విషయం మరొకటి లేదని వాపోయారు.