బ‌ర్త్ డే ట్రీట్.. ‘విశ్వం’ మూవీ నుండి కొత్త పోస్ట‌ర్ ఔట్ ..!

Birthday treat.. New poster out from 'Vishwam' movie..!
Birthday treat.. New poster out from 'Vishwam' movie..!

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా మూవీ ‘విశ్వం’ ప్ర‌స్తుతం శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీ ను ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ సినిమా పై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ మూవీ తో హీరో అండ్ డైరెక్ట‌ర్ ఖ‌చ్చితంగా హిట్ కొట్టాల‌ని చూస్తున్నారు.

Birthday treat.. New poster out from 'Vishwam' movie..!
Birthday treat.. New poster out from ‘Vishwam’ movie..!

ఇక నేడు బ‌ర్త్ డే జ‌రుపుకుంటున్న హీరో గోపీచంద్ త‌న అభిమానులకి ఒక స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ‘విశ్వం’ సినిమా నుండి ఒక స‌రికొత్త పోస్ట‌ర్ ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. అల్ట్రా స్టైలిష్ అవ‌తార్ లో మ్యాచో స్టార్ బైక్ పై వ‌స్తున్న పోస్ట‌ర్ ని ‘విశ్వం’ మూవీ మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో గోపీచంద్ చాలా కూల్ గా క‌నిపిస్తున్నారు . ఇక ఈ మూవీ లో కావ్య తాప‌ర్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పై టిజి.విశ్వ‌ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.