ఈ కుర్ర హీరోతో ఐటెం పాటల ఆంటీ పెళ్లి దాదాపు ఖరారు అయినట్టేనా…?

Arjun Kapoor And Malaika Arora To Tie The Knot Soon

హాలీవుడ్ సంస్కృతి మన ఇండియాలోకి జొరబడింది అంటే ఏమిటో అనుకున్నాం కానీ, బాలీవుడ్ కల్చర్ లో ఇప్పుడు గమనిస్తున్న మార్పులను చూస్తే నిజమే అనిపిస్తుంది. కుర్ర వయస్సు కుర్రాళ్లతో, మధ్యవయసు ఎప్పుడో దాటేసినా హీరోయిన్లు డేటింగులు చేయడం, పెళ్లిళ్లు చేసుకోవడం హాలీవుడ్లో చాలా అంటే చాలా సాధారణమైన విషయం. ఇది హాలీవుడ్కే పరిమితం అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. బాలీవుడ్ సినిమాలతో మంచి పేరు సాధించి, బాలీవుడ్ కి పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించి, హాలీవుడ్ కి ఎగిరెళ్ళిపోయిన ప్రియాంక చోప్రా, తన కంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ యంగ్ హీరో నిక్ జోనస్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి, ఆ తరువాత నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. త్వరలో వీళ్ళ పెళ్లి భాజాలు మోగడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

Malaika-Arora-movies

కానీ, ఇక్కడ అసలు విషయం ఏమిటయ్యా అంటే, బాలీవుడ్లో ఐటెం పాటలకు నర్తించే మలైకా అరోరా గుర్తుంది కదా…అదేనండి మన పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అంటూ వయ్యారాలు ఒలకబోస్తూ స్టెప్పులేసిందే ఆమెనండీ. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారు? బాలీవుడ్ కా షేర్ అని పిలవబడే సల్మాన్ ఖాన్ చిన్న తమ్ముడు అర్బాజ్ ఖాన్ కి స్వయానా సతీమణి మరియు ఒక యుక్త వయస్సు అబ్బాయికి తల్లి కూడానూ. వారిద్దరూ 2017 లో డైవోర్స్ తీసుకున్నారు. కానీ, మలైకా అరోరా తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో డైవోర్స్ కి గల ముఖ్య కారణం ఏమిటంటే మలైకా అరోరా కి, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ (బోనీ కపూర్ కొడుకు) కి గల ప్రేమాయణమే అని బాలీవుడ్ జనాలంతా చెవులు కోరుకుంటున్న విషయం. విడాకుల తరువాత, మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని ప్రైవేట్ పార్టీలకు, డిన్నర్లకు, మ్యారేజ్ ఇన్విటేషన్లకు కలిసి ఒకే కార్ లో వెళ్తున్న తీరు చూస్తే ఇది పుకారు కాదు నిజమే అని తెలిసిపోతుంది. తాజాగా వీరిద్దరూ మియామీలో హాలీడే ని ఎంజాయ్ చేస్తున్నారు.

Arjun-Kapoor-And-Malaika-Ar

అక్కడికి ఇప్పడు ఎందుకు వెళ్లారంటే కారణం మలైకా అరోరా 44 వ పుట్టినరోజుని ఈ ప్రేమికులు కలిసి సెలెబ్రేట్ చేసుకోవడానికే. మలైకా అరోరా కంటే అర్జున్ కపూర్ 11 ఏళ్ళు చిన్నవాడు. ఈ విషయంలో అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్ (శ్రీదేవి భర్త) తన కొడుకు సినిమా కెరీర్ లో సల్మాన్ ఖాన్ నుండి ఇబ్బందులు ఎదురవుతాయేమో అని కంగారు పడుతూనే ఉన్నారు అనుకోండి అది వేరే విషయం. కానీ, ఇలా భర్త పిల్లల్ని వదిలేసి మరీ, మెనోపాజ్ వయస్సులో కుర్ర హీరోతో ప్రేమ, పెళ్లి ఏమిటా అని విన్నవారందరూ ఆశ్చర్యపడిపోవడమే కాదు, ఇదే కల్చర్ కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో ఎలాగా అని తెగ ఇదైపోతున్నారు.

marriage-Arjun-Kapoor-And-M