పెళ్లి వేడుకలు నెల రోజుల ముందే షురూ!

Priyanka Chopra And Nick Jonas' Pre-wedding Celebrations Begin

బాలీవుడ్‌ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా హాలివుడ్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. అగస్టులో వీరి వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తాజాగా అమెరికాలో ప్రియాంక చోప్రాను పెళ్లి కూతురును చేశారని సమాచారం. నిక్‌ జోనస్‌ది అమెరికా కావడంతో అక్కడ ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మద్య పెళ్లి కూతురును చేశారు. ఘనంగా జరిగిన నిశ్చితార్థ వేడుకను చూస్తుంటే పెళ్లి ఇంకా ఏ రేంజ్‌లో జరుగుతుందో అని అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రియాంక, నిక్‌ల పెళ్లిని పూర్తి స్థాయి హిందూ సాంప్రదాయ పద్దతిలో రాజస్థాన్‌లోని ఒక కోటలో జరపనున్నారు. అందుకు ఇప్పటి నుండే సన్నాహాలు షురూ చేశారు. నిక్‌ క్రిస్టియన్‌ అయినా కూడా హిందూ సాంప్రదాయంలో పెళ్లికి అంగీకరించాడు. వీరి పెళ్లికి బాలీవుడ్‌, హాలివుడ్‌ సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరుకాబోతున్నారు.

Nick Jonas and Priyanka Chopra

ప్రియాంక, నిక్‌ల పెళ్లి డిసెంబర్‌లో జరుగనుంది. ఇరు కుటుంబ సభ్యులు డిసెంబర్‌లో మంచి ముహుర్తాన్ని ఫిక్స్‌ చేశారు. అయితే పెళ్లికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నా కూడా అప్పుడే వేడుకలు షురూ చేశారు. పెళ్లి సాంప్రదాయ బద్దంగా మూడు రోజుల పాటు జరుగనుందట. ఇకపోతే తాజాగా జరిగిన పెళ్లి కూతురును చేసే వేడుకలో అంతా కూడా ఫుల్‌ ఎంజాయ్‌ చేసినట్టు, బంధువులంతా ఈ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తారని తాను అనుకోలేదని ప్రియాంక చెప్పుకొచ్చింది. రూల్స్‌ బ్రేక్‌ చేస్తూ అంతా చాలా ఎంజాయ్‌ చేశాం, ఈ పార్టీ ఏర్పాట్లను చూసి షాకయ్యాను, పెళ్లి కూతురును చేయడం అంటే ట్రెడిషినల్‌ ఈవెంట్‌ అని అనుకున్నా కానీ దాని తర్వాత చేసిన ఎంజాయ్‌ మాత్రం అంతా ఇంతా కాదు, అందరికి చాలా థాంక్స్‌ అంటూ పీసీ చెప్పుకొచ్చింది.