మ‌హేశ్ బాబు భార్య‌కు చాలా పొగ‌రు : మలైకా అరోరా

Malaika Arora Says Mahesh Babu Wife Namratha Has Too Proud
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ పేరుకు త‌గ్గ‌ట్టు న‌మ్ర‌త‌గా ఉంటార‌ని పేరు. నిజానికి మ‌హేష్ బాబు భార్య‌గా ఆమె గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ‌. భ‌ర్త‌లానే ఎప్పుడూ మీడియాకు, ప్ర‌చారానికి దూరంగా ఉంటుంటారు. మోడ‌ల్ గా, మాజీ మిస్ ఇండియాగా, బాలీవుడ్ హీరోయిన్ గా ఒక‌ప్పుడు మంచి గుర్తింపు ఉన్న న‌మ్ర‌త ముంబై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత భ‌ర్త చాటు భార్య‌గానే ఉంటున్నారు. ఇప్పుడే కాదు..హీరోయిన్ గా ఉన్న‌ప్పుడూ ఆమె అంద‌రితో చాలా మంచిగా ఉంటార‌ని, మ‌ర్యాద‌గాప్ర‌వ‌ర్తిస్తార‌ని బాలీవుడ్ లో చెప్పుకుంటుంటారు. అయితే ప్ర‌ముఖ డ్యాన్స‌ర్ మ‌లైకా అరోరా మాత్రం న‌మ్ర‌త‌పై ఓ షాకింగ్ కామెంట్ చేశారు. సినిమాల్లోకి రాక‌ముందు న‌మ్ర‌త మోడ‌ల్ గా ఉన్న‌ప్పుడు, మ‌లైకా కూడా మోడ‌లింగ్ లో ప్ర‌వేశించారు.

మోడ‌లింగ్ లో మలైకాకు సీనియ‌ర్ అయిన న‌మ్ర‌త ఆమెతో దురుసుగా ప్ర‌వ‌ర్తించేవార‌ట‌. ఈ విష‌యాన్ని వోగ్ బీఎఫ్ఎఫ్ కార్య‌క్ర‌మంలో స్వ‌యంగా మ‌లైకా వెల్ల‌డించారు. త‌న సోద‌రి అమృతతో కలిసి మ‌లైకా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. మోడ‌లింగ్ రంగంలో త‌నకు తొలినాళ్ల‌లో ఎదుర‌యిన అనుభ‌వాల‌ను పంచుకునే క్ర‌మంలో ఆమె న‌మ్ర‌త ప్ర‌వ‌ర్త‌న గురించి చెప్పారు. నేను మోడ‌లింగ్ లో ఉన్న‌ప్పుడు న‌మ్ర‌త, ఆమె స్నేహితురాలు మెహ‌ర్ జెస్సియా నాకు సీనియ‌ర్లు. అప్ప‌టికే వారు మంచి మోడ‌ళ్లుగా పేరు తెచ్చుకున్నారు. దాంతో కొత్త‌గా వ‌చ్చినవారితో పొగ‌రుగా ప్ర‌వ‌ర్తిస్తూ సీనియారిటీ ప్ర‌ద‌ర్శించేవారు. అయితే ఇప్పుడు వారిద్ద‌రూ నాతో స్నేహ‌పూర్వ‌కంగా ఉంటున్నారు అని చెప్పారు మ‌లైకా అరోరా.

న‌మ్ర‌త‌తో ఉన్న స్నేహం కార‌ణంగానే మ‌లైకా అరోరా మ‌హేశ్ బాబు అతిథి సినిమాలో ఓ సాంగ్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే