భరత్‌కు కలిసి వచ్చే అంశం

Bharat Ane Nenu Chance To Cross 200 Crores With Na Peru Surya Talk

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారం రోజుల్లోనే ఈ చిత్రం 125 కోట్ల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం ఈ చిత్రం 200 కోట్ల క్లబ్‌ వైపుకు వేగంగా దూసుకు పోతుంది. ఈ సమయంలోనే విడుదలైన అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం వల్ల భరత్‌ అనే నేను కలెక్షన్స్‌ తగ్గే అవకాశం ఉందని అంతా భావించారు. కాని నా పేరు సూర్య చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది అంటూ మొదటి రోజు టాక్‌ వచ్చింది. దానికి తోడు అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా ఆ చిత్రం లేదనే టాక్‌ కూడా వస్తుంది. దాంతో భరత్‌ అనే నేను చిత్రం కలెక్షన్స్‌ డ్రాప్‌ అయ్యే సమస్యే లేదని, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఖచ్చితంగా భరత్‌కు ఇంకా క్యూ కడుతారనే నమ్మకంను ట్రేడ్‌ పండితులు వ్యక్తం చేస్తున్నారు. 

నా పేరు సూర్య సక్సెస్‌ అయినా ఫలితం తారు మారు అయినా కూడా భరత్‌ 200 కోట్లు వసూళ్లు చేయడం ఖాయం అనుకున్నారు. అయితే తాజాగా సూర్య చిత్రంకు నెగటివ్‌ టాక్‌ వస్తున్న కారణంగా ఇప్పుడు మహేష్‌బాబు 225 కోట్లను వసూళ్లు చేస్తాడనే ధీమా వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు మూడు సినిమాలు మాత్రమే 200 కోట్ల క్లబ్‌లో చేరాయి. తెలుగులో నాల్గవ సినిమాగా ఈ చిత్రం నిలవడం ఖాయం అనిపిస్తుంది. 225 కోట్లతో మహేష్‌బాబు బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడం ఖాయం అని అభిమానులు ఇప్పుడు గట్టిగా చెబుతున్నారు. సమ్మర్‌ హాలీడేస్‌ ఇంకా చాలా రోజులు ఉండటంతో పాటు రంగస్థలం డల్‌ అవ్వడం, సూర్య చిత్రంకు నెగటివ్‌ టాక్‌ రావడం వంటి కారణాల వల్ల భరత్‌ అనే నేను భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తుందని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో అయిదు రోజుల్లో మహానటి రాబోతుంది. ఆ చిత్రం వల్ల భరత్‌ జోరుకు బ్రేక్‌ పడే అవకాశం ఉందనిపిస్తుంది.