రెండో టీజర్‌ ఉద్దేశ్యం ఏంటి?

RGV Releasing Second Teaser To Nagarjuna Officer Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అక్కినేని నాగార్జున, రామ్‌ గోపాల్‌ వర్మల కాంబినేషన్‌లో చాలా సంవత్సరాల తర్వాత తెరకెక్కిన చిత్రం ‘ఆఫీసర్‌’. వీరిద్దరి కాంభినేషన్‌లో ఇప్పటికే వచ్చిన మూడు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ‘శివ’ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ గతిని మార్చేశాయి అని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి కాంబోలో ‘ఆఫీసర్‌’ మూవీ అనగానే అందరిలో ఆసక్తి రేకెత్తింది. అయితే గత దశాబ్ద కాలంగా వర్మకు సరైన సాలిడ్‌ సక్సెస్‌ దక్కలేదు. ముక్కుతూ మూలుగుతూ సక్సెస్‌ల కోసం వర్మ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆఫీసర్‌తో తన మునుపటి క్రేజ్‌ను సొంతం చేసుకుంటాను అంటూ వస్తున్నాడు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలు మరియు ఇతరత్ర కారణాల వల్ల ఆఫీసర్‌ సినిమాపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంతగా ఆసక్తి లేదు. 

ఎన్నో అంచనాల నడుమ స్వీయ దర్శకత్వంలో తాను నిర్మించిన ఆఫీసర్‌ చిత్రం ప్రస్తుతం విడుదల అవ్వడమే కష్టం అవుతున్న సమయంలో వర్మకు భయం పట్టినట్లుగా అనిపిస్తుంది. ఇప్పటికే ఆఫీసర్‌ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఇటీవలే ఒక టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. ఆ టీజర్‌ పర్వాలేదు అనిపించింది. సినిమాలో ఏదో మ్యాటర్‌ ఉంటుందేమో అనే అనుమానాలు ఆ సినిమా కలిగించింది. అయినా కూడా మరోసారి వర్మ రెండవ టీజర్‌ అంటూ నేడు విడుదలకు రంగం సిద్దం చేశాడు. ఈ నేపథ్యంలో ఆఫీసర్‌ చిత్రంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసు ఆఫీసర్‌ చిత్రం ఆడుతుందా, వర్మకు కూడా ఆ చిత్రంపై నమ్మకం ఉన్నట్లుగా లేదని, నాగార్జున ఆ సినిమా గురించి పట్టించుకోవడమే మానేశాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో సినిమా గురించి నలుగురు మాట్లాడుకోవాలనే ఉద్దేశ్యంతో మళ్లీ ఆఫీసర్‌ రెండవ టీజర్‌ అంటూ తీసుకు వస్తున్నారని ప్రచారం జరుగుతుంది.