ఏదోలా 400 పట్టారు

Ram Gopal Varma Officer Movie Release In 400 Theaters

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘ఆఫీసర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాకు థియేటర్లు లభించడం కష్టమే అని అంతా అనుకున్నారు. కాని నాగార్జున మంత్రాంగం నడిపించి ఈ చిత్రం విడుదలకు తన వంతు సాయం చేశాడు. వర్మపై కోపంతో డిస్ట్రిబ్యూటర్లు మరియు పలువురు నిర్మాతలు ఈ చిత్రాన్ని విడుదల కానిచ్చేది లేదు అంటూ పట్టుబట్టారు. కాని నాగార్జున నటించిన చిత్రం అవ్వడంతో పాటు, నాగార్జున నిర్మాణ భాగస్వామి అవ్వడం వల్ల ఈ సినిమా విడుదలకు ప్రయత్నాలు జరిగాయి. ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు కనీసం 600 థియేటర్లలో విడుదల కావడం కామన్‌. కాని ఈ చిత్రం మాత్రం కేవలం 350 థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ మరియు మెగా ఫ్యాన్స్‌కు చెందిన థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల కానివ్వడంలేదు. అందుకే థియేటర్ల సంఖ్య తక్కువగా ఉందని తెలుస్తోంది. ఈస్థాయిలో కూడా లభించకుండా చూడాలని మెగా ఫ్యాన్స్‌ ప్రయత్నాలు చేశారు. కాని నాగార్జునతో పాటు కొంతమంది వర్మకు మద్దతుగా ఉన్న వారు 350 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు కృషి చేశారు. నైజాం ఏరియాలో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించలేదు. సీడెడ్‌ మరియు ఆంధ్రాలో కాస్త ఎక్కువగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం విడుదల సమయంకు ఇబ్బందులు ఎదుర్కొవడానికి కారణం వర్మ ఆ మద్య పవన్‌పై చేసిన విమర్శలు. శ్రీరెడ్డితో పవన్‌పై విమర్శలు చేయించడం వల్ల పరిస్థితి మరీ తీవ్రతరం అయ్యింది. వర్మ తర్వాత సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉండే అవకాశం ఉంది.