ఆత్మహత్యే చేసుకుంటానంటున్న ‘ఆఫీసర్’ ఏపీ డిస్ట్రిబ్యూటర్!

Officer Distributor Subramanyam Decides To End His Life

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మొదలయిన తొలినాళ్ళ నుండి సినిమా లో అనేక మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. అప్పట్లో సినిమా హిట్ అని చెప్పాలంటే ఏ సినిమా ఎక్కువ రోజులు, ఎక్కువ సెంటర్లు ఆడింది అనే అంశాల మీద బేస్ అయి ఉండేది కానీ ఇప్పుడు సినిమా వచ్చాక ఫస్ట్ వారం ఎక్కువ కలెక్షన్లు వస్తే అదే హిట్ అనే రేంజ్ కి వచ్చేసింది తెలుగు సినిమా అయితే డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళు ఒకప్పుడు సినిమా రషెస్ లేదా పూర్తి నిడివి సినిమా చూసాక సినిమా మీద పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది, కేవలం కాంబినేషన్లు హీరో మార్కెట్ చూసి సినిమాలు కొనేస్తున్నారు. హీరో డైరెక్టర్ లతోపాటు డిస్త్రిబ్యుటర్ తలరాత బాగుంటే సినిమా హిట్ అయితే నాలుగు డబ్బులు కళ్ల చూడడం, లేదా కోట్లు పోగొట్టుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చూసుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువయిపోయారు.

కానీ ఒక్కో సరి చిన్న బయ్యర్ లు తెగించి రిస్క్ లు చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, రజనీకాంత్ లింగా, కబాలి టైం లలో వినే ఉంటాం ఇప్పుడు అదే పరిస్థితి ఆర్జీవీ నాగ్ ల ఆఫీసర్ సినిమా తీసుకున్న ఒక డిస్త్రిబ్యుటర్ కి ఎదురయ్యంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఆఫీసర్’ సినిమా రైట్స్ కొనుగోలు చేసిన సుబ్రహ్మణ్యం అనే డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు తనకు ఆత్మహత్యే శరణ్యమని మీడియా ముందు ఘోల్లుమన్నాడు. ‘ఇండియా టుడే’తో మాట్లాడిన ఆయన, ఆఫీసర్ షూటింగ్ సమయంలో తన వద్ద నుంచి వర్మ రూ. 1.30 కోట్ల ఫైనాన్స్ తీసుకున్నాడని ఆపై సినిమా పూర్తి అయినా, ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదని, తాను అడిగితే, కోర్టుకు వెళ్లాలని వర్మ బెదిరించారని ఆరోపించారు. కోర్టుకు వెళితే, సమస్య తేలేందుకు సమయం పడుతుందన్న ఉద్దేశంతో, సినిమా గోదావరి రైట్స్ ఇవ్వాలని అడిగానని, కేవలం గోదావరి రైట్స్ మాత్రమే విడిగా ఇచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసిన వర్మ, ఏపీ రైట్స్ మొత్తం తీసుకోవాలని చెప్పాడని అన్నారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను మరో రూ. 3.50 కోట్లు చెల్లించి ఏపీలో సినిమాను విడుదల చేశానని, తొలి షో నుంచే మినిమమ్ కలెక్షన్లు కూడా రాలేదని విలపించాడు. లాభాలు వస్తాయని భావించిన చిత్రం భారీ నష్టాలను మిగిల్చిందని, ఆత్మహత్యే శరణ్యమని చెప్పారు.

నిజానికి నాగ్-వర్మ లాంటి కాంబినేషన్ కు ఇది చాలా మంచి రేట్ ఎందుకంటే తెలుగు సినీ గమనాన్నే మార్చిన శివ కాంబినేషన్ అది. నాగ్ మునుపటి చిత్రం రాజుగారి గది-2 ఆంధ్ర ఏరియాలో ఏడుకోట్ల వరకు చేసింది, ఇది అందులో సగం చేయదా? అని. అందుకే ఐదు కోట్లు అయినా పెట్టి కోనేసారు వేరే దారి లేదు కాబట్టి. ఇకపోతే ఐదు కోట్లు పెట్టి కొంటె ఆంధ్ర అంతటికీ కలిపి తొలిరోజు గట్టిగా ముఫైలక్షలు రాలేదట. ఈ భారీ కుదుపు వల్ల కెరీర్ మొదటి నుండి సంపాదించిన పెట్టుబడి అంతా పోతే ఇక చావే గతి అంటున్నాడు. ఆర్జీవీనో నాగర్జునో ఈ విషయం మీద స్పందించక పోతే పరిస్థితులు  తీవ్రమయ్యే అవకాసం కనపడుతోంది.