కొరటాల, అఖిల్‌ ఫిక్స్‌ అయ్యేలా ఉంది

Akhil Next Movie Going To Set With Director Koratala Shiva

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌లో ప్రస్తుతం నెం.2 దర్శకుడిగా కొరటాల శివకు పేరుంది. అంతటి క్రేజ్‌ ఉన్న దర్శకుడితో సినిమా చేసేందుకు ఏ హీరో అయినా ఆసక్తి చూపిస్తాడు. ఇక యువ హీరోలు అయితే పడి చస్తారు. ఇటీవలే ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు స్థాయి వసూళ్లను సాధించి టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా భరత్‌ను నిలిపాడు. బాహుబలి చిత్రం తర్వాత కొరటాల సినిమాలు వరుసగా ఉన్నాయి. దాంతో రికార్డు స్థాయిలో కొరటాల శివకు క్రేజ్‌ ఉంది. ఆయనతో సినిమాలు నిర్మించేందుకు కోట్లు పట్టుకుని నిర్మాతలు క్యూలో ఉన్నారు. భరత్‌ తర్వాత కొరటాల సినిమా ఏంటీ అనేది ప్రస్తుతం అందరిని తొలుస్తున్న ప్రశ్న. 

ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం కొరటాల ద్వారానే భించింది. భరత్‌ అనే నేను చిత్రం ప్రమోషన్‌లో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ తన తర్వాత సినిమాలో సందేశం ఇవ్వాలనుకోవడం లేదని, కొత్త హీరోతో లవ్‌ స్టోరీతో ఒక మంచి కమర్షియల్‌ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. అఖిల్‌ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయంతెల్సిందే. ఆ చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం అఖిల్‌ తన తదుపరి చిత్రాన్ని కొరటాల దర్శకత్వంలో చేస్తాడని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. 

ఆ ప్రచారంకు బలం చేకూర్చేలా కొరటాల తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ కారణంగానే తప్పకుండా అఖిల్‌, కొరటాల కాంబో మూవీ వర్కౌట్‌ అవ్వడం ఖాయం అంటున్నారు. దాదాపు 20 కోట్ల పారితోషికంను అక్కినేని వారు కొరటాలకు ఆఫర్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం అధికారిక ప్రకటన జూన్‌ లేదా జులైలో ఉండే అవకాశం ఉంది. వచ్చే సంత్సరం వేసవికి ముందే అఖిల్‌, కొరటాల శివల మూవీ విడుదల అవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారు.

కొరటాల, అఖిల్‌ ఫిక్స్‌ అయ్యేలా ఉంది - Telugu Bullet