‘మిస్టర్‌ మజ్ను’కు తప్పని తిప్పలు…!

Akhil Mr Majnu Movie Release Postponed

అక్కినేని యంగ్‌హీరో అఖిల్‌ ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అఖిల్‌ తొలి రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అఖిల్‌తో పాటు నాగార్జున కూడా ‘మిస్టర్‌ మజ్ను’ చిత్రంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ చివర దశకు చేరుకుంది. ఈ చిత్రంలో అఖిల్‌ సరసన నిధి అగర్వాల్‌ రొమాన్స్‌ చేస్తోంది. బివియస్‌యన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత డిసెంబర్‌ 21న విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావించారు. కానీ అదే రోజు ‘అంతరిక్షం’, ‘పడి పడి లేచే మనసు’లతో పాటు పు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దాంతో డిసెంబర్‌లో విడుద చేసే ఆలోచన మానుకున్నారు.

Akhil Mr Majnu Movie Release On January

అఖిల్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన ఈ చిత్రాన్ని మంచి టైంలో రిలీజ్‌ చేయాలని నాగార్జున భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో కాకుండా వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేయడానికి సిద్ద పడ్డారు. కానీ తాజా పరిణామాలను చూస్తే అప్పుడు కూడా విడుదల కావడం అనుమానమే. జనవరి 24న బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’ విడుదల కాబోతుంది. దాంతో చిత్ర యూనిట్‌ ఆలోచనలో పడ్డారు. ఇక అఖిల్‌ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేయాని నిశ్చయించుకున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్ర విడుదలకు తిప్పలు తప్పడం లేదు. ఈ సారైనా ‘మిస్టర్‌ మజ్ను’ అనుకున్న సమయానికి విడుదలవుతుందో చూడాలి.

Akhil New Movie Mr Majnu Release On Repablic Day