లవర్స్ డే కి డబుల్ కా మీఠా ఇవ్వనున్న రకుల్…!

Double Dhamaka For Rakul Preet Singh On Valentine Day

తెలుగు సినీ పరిశ్రమలోకి వేంకటాద్రి ఎక్స్ప్రెస్ తో ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌ ద‌క్షిణాదిలోనే కాదు హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ త‌న‌దైన శైలితో ముందుకు సాగుతోందీ. ఈ ఏడాదిలో వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేయ‌బోతున్న ఈ ముద్దుగుమ్మ‌కి ఈ వాలంటైన్స్ డే వెరీ స్పెష‌ల్ కానుంది. ఎందుకంటే అదే రోజు కోలీవుడ్ బ్ర‌ద‌ర్స్ సూర్య‌, కార్తితో క‌ల‌సి `డ‌బుల్ ధ‌మాకా`ఇవ్వ‌బోతోంది ర‌కుల్‌. ఖాకి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత కార్తితో క‌ల‌సి ర‌కుల్ ప్రీత్ న‌టించిన ట్రావెల్ ల‌వ్ స్టోరీ దేవ్‌ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేమికుల రోజు కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఇక అదే రోజున సూర్య‌తో క‌ల‌సి ర‌కుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా న‌టించిన ఎన్జీకే సినిమాకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కాబోతోంది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ర‌కుల్ పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. మొత్త‌మ్మీద‌ ఈ ప్రేమికుల రోజున అన్న‌ద‌మ్ములైన సూర్య‌, కార్తి కాంబినేష‌న్‌లో అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నుంద‌న్న‌మాట ర‌కుల్‌. ఈ రెండు సినిమాల‌తోనూ ర‌కుల్‌కి మంచి విజ‌యాలు ద‌క్కాల‌ని ఆకాంక్షిద్దాం.