అగ్గి రాజేస్తున్న రకుల్ నాజూకు అందం

Double Dhamaka For Rakul Preet Singh On Valentine Day

రకుల్ ప్రీత్ సింగ్, ఈ 28 ఏళ్ళ పంజాబీ అమ్మాయి కాలేజీ డేస్ లో మోడల్ గా చేసి, కాసిన్ని డబ్బులు పాకెట్ మనీ గా సంపాదించుకున్నాక, చేతి ఖర్చులకోసం గిల్లి అనే కన్నడ సినిమాలో నటించి, తెరంగేట్రం చేసి, ఆ తరువాత తెలుగు లో కెరటం అనే ఒక సినిమా, తమిళంలో ఒక రెండు సినిమాలు చేశాక, సందీప్ కిషన్ సరసన నటించిన వేంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో హీరోయిన్ గా ఒక కొత్త వెలుగు సంపాదించుకుంది. వెంటనే, హిందీలో కూడా యారియా సినిమాలో నటించి, ఆ తరువాత వెనువెంటనే తెలుగు మరియు తమిళం సినిమాలతో బిజీ స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2017 లో మహేష్ బాబు తో కలిసి నటించిన స్పైడర్ సినిమా ఘోరపరాజయం పొందాక, మళ్ళీ ఒక్కటంటే ఒక్కటి తెలుగు సినిమాలో కూడా నటించలేదు.

rakul-smile

 

మళ్ళీ బాలీవుడ్ కి జంప్ అయ్యి, సిద్ధార్థ మల్హోత్రా తో కలిసి నటించిన ఐయ్యారి సినిమా అట్టర్ ప్లాపు అయ్యేసరికి, వెంటనే సౌత్ సినిమా కి రిటర్న్ టికెట్ తీసుకొని, తమిళంలో ల్యాండ్ అయ్యి, కార్తీ సరసన ఖాకీ సినిమాలో నటించి, మంచి విజయం సాధించుకుంది. ఇప్పుడైతే, తెలుగు లో ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో ఒక అతిధి పాత్రలో మాత్రమే నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్, తమిళంలో మాత్రం కార్తీ సరసన దేవ్ సినిమాలోనూ, సూర్య సరసన ఎన్ జి కే సినిమాలోనూ, శివ కార్తికేయన్ సరసన మరో చిత్రంలోనూ నటిస్తూ, హిందీ లో కూడా అజయ్ దేవగణ్ సరసన దే దే ప్యార్ దే సినిమాలో నటిస్తూ బిజీ బిజీ గా ఉంది. బొద్దుగా, ముద్దుగా ఉండే రకుల్ బాలీవుడ్ ఫిజిక్ కి మ్యాచ్ అవ్వాలని కాబోలు సన్నబడి, సన్నజాజి తీగలా నాజూకుగా తయారయ్యి, మొదట్లో కాస్త కంగారు పుట్టించినా, ఇప్పుడైతే నాజూకు అందంతో చూపరుల మతులను కొల్లగొట్టేస్తుంది.

image.png