అన్న కెరీర్ ని గాడి లో పెట్టాలని తపిస్తున్న టాప్ హీరో…!

NTR Big Plan For Kalyan Ram

నందమూరి కళ్యాణ్ రామ్ మరియు నందమూరి తారక రామారావు (జూ. ఎన్టీఆర్) లు స్వయానా రక్తం పంచుకొని పుట్టిన అన్నదమ్ములు. వాళ్ళ తల్లులు వేరైనప్పటికీ, తండ్రి నందమూరి హరికృష్ణ కావడం, సీనియర్ ఎన్టీఆర్ కి జూ. ఎన్టీఆర్ అంటే వల్లమాలిన ప్రేమ ఉండడం వలన చిన్నప్పటినుండీ నందమూరి ఫ్యామిలీలోనే పెరిగాడు. జూ. ఎన్టీఆర్ సినిమా హీరో అయిన కొత్తలో జూ. ఎన్టీఆర్ సినిమాల ఫంక్షన్లలో కళ్యాణ్ రామ్ అంతగా కనపడకపోవడం గమనించాల్సిన విషయం. కానీ, కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య సఖ్యత పెరిగింది. నందమూరి అన్నదమ్ములు ఒకరికి ఒకరు అన్నట్లుగా ఒకరి సినిమాలని మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నారు.అయితే తమ్ముడైన జూ. ఎన్టీఆర్ కి వచ్చిన స్టార్ డమ్ అన్న కళ్యాణ్ రామ్ కి రాలేదన్నది కాదనలేని నిజం. అతనొక్కడే తరువాత మళ్ళీ హిట్ కొట్టడానికి కొన్నేళ్లు ఎదురుచూసి చివరికి పటాస్ తో హిట్ కొట్టినా, ఆ తరువాత కూడా మరో హిట్టు కొట్టలేకపోయాడు.

kalyanram

ఇక లాభం లేదనుకొని, అన్న కెరీర్ ని సరైన గాడిలో పెట్టాలని జూ. ఎన్టీఆర్ తనవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాడు. ఇందులో భాగంగా భారీ బడ్జెట్ సినిమాలతో వరుస హిట్లు కొడుతున్న నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తన అన్న కళ్యాణ్ రామ్ సినిమాని ఖరారు చేశాడు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో అనేది ఇంకా తెలియకపోయినా, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ తోనే ఉంటుంది అనేది తెలుస్తున్న విషయం. కానీ, మైత్రి మూవీ మేకర్స్ వారు తాజాగా నిర్మించిన రెండు సినిమాలు ఘోరపరాజయం పాలయ్యి, తీవ్రమైన నష్టాలను మిగిల్చాయి. అవి అక్కినేని నాగ చైతన్యతో నిర్మించిన సవ్యసాచి ఒకటి కాగా, రవితేజ తో శ్రీను వైట్ల దర్శకత్వంలో నిర్మించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలు. ఈ నష్టాలను పూడ్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక పెద్ద హీరోతో సినిమా తీసి, ఘనవిజయం కొడితే కానీ వాళ్ళ లెక్క సరికాదు. అయినా, జూ. ఎన్టీఆర్ అడిగాక కాదనడం జరిగే పనేనా. అందులోనూ జనతా గ్యారేజ్ అనే సూపర్ హిట్ సినిమాని వాళ్ళతో చేశాడు. తన తదుపరి చిత్రం వాళ్ళతో చేస్తాను అనే ఒక్క హామీ ఇస్తే చాలు, ఏ నిర్మాణ సంస్థలైన జూ. ఎన్టీఆర్ అడిగే విషయానికి బ్రహ్మండంగా తలూపి, ఒప్పుకుంటాయి.

ntr-harikrishna