రకుల్ బక్క చిక్కినా అందమే…!

Rakul Preet Singh Hard Workout In Gym For Movie

ఏ మాటకా మాట చెప్పుకోవాలి. సౌత్ సినీ ప్రేక్షకులకి సన్నగా మెరుపుతీగలా ఉన్న హీరోయిన్స్ కంటే, బొద్దుగా ఉండే ముద్దుగుమ్మలే నచ్చుతారు. అందుకేనేమో సౌత్ లో ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ లో అయితే ఏకంగా బొద్దు హీరోయిన్లు అయినా ఖుష్బూ , నమిత లాంటి హీరోయిన్లకు గుళ్లే కట్టేశారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడైతే తెలుగు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు గానీ, హిందీలో ఒక సినిమా, తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీ గానే ఉంది. వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాలో ముద్దు ముద్దుగా కనిపించిన రకుల్, ఆ తరువాత లౌక్యం, పండగ చేస్కో, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సినిమాల్లో కాస్త ఒళ్ళు చేసి, బొద్దుగా కనిపించి అందరికి నచ్చేసింది. ఇంతలో ఐయ్యారి అనే హిందీ సినిమాకి సైన్ చేసి, నార్త్ వాళ్ళకి సన్నజాజి నడుములే నచ్చుతాయి అనుకొని కాస్త ఎక్కువగానే సన్నపడింది.

rakul-movies

ఆ సినిమా పరాజయం పాలయింది అనుకోండి అది వేరే విషయం. అసలే రకుల్ కి తెలుగులో ఉన్న ముద్దు పేరు భీభత్సమైన ఫిట్ నెస్ ఫ్రీక్ అని. ఇక హిందీలో ఒక ప్లాప్, తమిళంలో తొలి సినిమా స్పైడర్ కూడా ప్లాప్ అయ్యేసరికి ఫీల్ అయ్యి, ఇంకా సమయం అంతా జిమ్ లో గడిపేసిందేమో ఏమో కానీ కొన్ని నెలల నుండి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న రకుల్ ఫోటోలు చూస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. ఆ ఫోటోషూట్స్ లలో బుగ్గలు అన్ని పోయి, చాలా సన్నబడిపోయిన రకుల్ ని చూసి, కలత చెందిన ఆమె సౌత్ ఫాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేసినంత పని చేశారు. అసలే తమిళంలో మూడు పెద్ద సినిమాలు చేస్తుందాయే. ఇంత సన్నగా ఉంటే అసలుకే ఎసరు వస్తుందని అనుకుందేమో కాస్త అంటే కాస్త ఒళ్ళు పెంచి, నాజూకుగా కనిపించింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తమిళంలో సూర్యతో ఒక సినిమా, కార్తీ తో రెండో సినిమా, శివ కార్తికేయన్ తో మూడో సినిమా చేస్తుంది. ఇది కాక హిందీ లో అజయ్ దేవగన్ సరసన దే దే ప్యార్ దే లో కూడా నటిస్తుంది.

rakul