ఆర్‌ఎక్స్‌ బ్యూటీతో మాస్‌ రాజా రొమాన్స్‌

Payal Rajput To Romance Ravi Teja In Upcoming Film

చిన్న చిత్రంగా తెరకెక్కి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఆర్‌ఎక్స్‌ 100 చిత్రంలో హీరోయిన్‌గా నటించిన పాయల్‌ రాజ్‌పూత్‌ ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఈమెకు రామ్‌ చరణ్‌, బోయపాటి సినిమాలో ఐటెం సాంగ్‌ కూడా చేసే అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే ఐటెం సాంగ్‌ను చేసేందుకు నో చెప్పిన పాయల్‌ కు రెండు మూడు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. త్వరలోనే ఈమె రవితేజకు జోడీగా ఒక చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

nabha-natesh And payal rajput

ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం తర్వాత విఐ ఆనంద్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడు. త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా నభా నటేష్‌ ఎంపిక అయ్యింది. తాజాగా పాయల్‌ రాజ్‌పూత్‌ను కూడా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కథానుసారంగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌కు చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుందట. అందుకే పాయల్‌ను ఈ చిత్రంలో ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.