బన్నీకి సూపర్‌ స్టార్‌ బ్యూటీని ఫిక్స్‌ చేసిన త్రివిక్రమ్‌

Heroine Confirmed For Allu Arjun And Trivikram Film

అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో ఒక చిత్రం చేయాల్సి ఉన్నా కూడా ప్రయోగం చేసి మరో ఫ్లాప్‌ను మూటకట్టుకోవడం ఎందుకని, త్రివిక్రమ్‌ కోసం ఇన్ని రోజులు వెయిట్‌ చేశాడు. వెయిటింగ్‌ పూర్తి అయ్యింది. ‘అరవింద సమేత’ చిత్రంతో అదిరిపోయే రికార్డు సక్సెస్‌ను దక్కించుకున్న త్రివిక్రమ్‌ తాజాగా అల్లు అర్జున్‌ కోసం సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అల్లు అర్జున్‌తో మూవీని మొదలు పెట్టాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను తీసుకు వచ్చేలా స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. తాజాగా ఈ హీరోయిన్‌ను త్రివిక్రమ్‌ ఎంపిక చేశాడు.

trivikram srinivas and allu arjun film

బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ నేపథ్యంలో వెంటనే రామ్‌ చరణ్‌, బోయపాటి మూవీలో ఛాన్స్‌ను దక్కించుకుంది. మరో వైపు హిందీలో కూడా ఈమె వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఒక వైపు హిందీలో సినిమాలు చేస్తూ సౌత్‌ సినిమాలు చేయడం చాలా అరుదు. ఇలాంటి సమయంలోనే అల్లు అర్జున్‌కు జోడీగా కూడా ఈ అమ్మడు ఎంపిక అయ్యింది. సినీ వర్గాల నుండి విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ మూవీలో కియారా అద్వానీ ఎంపిక అయినట్లుగా తెలుస్తోంది. సినిమా ప్రారంబోత్సవం సమయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది